: డ్రైవింగ్ టెస్టు చేస్తుండగా ప్రమాదం
డ్రైవింగ్ టెస్టులో ఉన్న ఒక కారు ఆర్టీఏ కార్యాలయంలోకి దూసుకెళ్లిన సంఘటనలో ఇద్దరు వ్యక్తులు తీవ్రంగా గాయపడ్డారు. కరీంనగర్ జిల్లా జగిత్యాల ఆర్టీఏ కార్యాలయంలో ఈరోజు డ్రైవింగ్ టెస్టు నిర్వహించారు. డ్రైవింగ్ టెస్ట్ లో పాల్గొన్న ఒక వ్యక్తి కారు నడుపుతుండగా ఆర్టీఏ ప్రాంగణంలో ఉన్న ప్రజలపైకి దూసుకుపోయింది. ఇద్దరు వ్యక్తులకు గాయాలవడంతో పాటు నాలుగు వాహనాలు ధ్వంసమయ్యాయి. ఈ సంఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కాగా, క్షతగాత్రులను సమీప ఆసుపత్రికి తరలించారు. వారి పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు చెప్పారు.