: సెకండ్ ఇన్నింగ్స్ మొదలెడుతున్న సంజయ్ దత్
హీరో సంజయ్ దత్ బాలీవుడ్ లో తన రెండో ఇన్నింగ్స్ మొదలు పెట్టేందుకు సిద్ధమవుతున్నాడు. ఇలా విడుదలయ్యాడో లేదో అప్పుడే దత్ తో సినిమాలు చేసేందుకు దర్శకులు ఉత్సాహం చూపుతున్నారు. ఇప్పటికే ఆయన్ని దృష్టిలో పెట్టుకుని కథలు రెడీ చేసుకున్న వారు ఆయన డేట్స్ కోసం ప్రయత్నాలు మొదలెట్టారు. ఈ క్రమంలో 'బ్యాంగ్ బ్యాంగ్' సినిమా దర్శకుడు సిద్ధార్థ్ ఆనంద్ దర్శకత్వంలో ఓ యాక్షన్ తరహా చిత్రం చేసేందుకు ఒప్పుకున్నాడని సమాచారం. ఈ వేసవిలో ఈ చిత్రం షూటింగ్ ప్రారంభిస్తామని దర్శకుడే స్వయంగా చెప్పారు. మరిన్ని వివరాలను త్వరలోనే తెలియజేస్తామన్నారు. అలాగే, మరో దర్శకుడు ఉమేష్ శుక్లాతో కూడా ఓ సినిమా చేయడానికి సంజూ ఓకే చెప్పాడట.