: ఈసారి బడ్జెట్ లో యువతకు ప్రత్యేక ప్రాధాన్యత: మంత్రి యనమల


ఈసారి బడ్జెట్ లో యువతకు ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తామని ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు తెలిపారు. యువతకు ప్రాధాన్యం ఇచ్చేలా కార్యక్రమాలు ఉంటాయన్నారు. అంతేగాక గ్రూప్ 1, గ్రూప్ 2, పోలీసు, వైద్య నియామకాలకు చర్యలు తీసుకుంటామని విజయవాడలో వెల్లడించారు. నైపుణ్యాల అభివృద్ధికి అన్ని రంగాల్లోనూ అత్యధిక ప్రాధాన్యం ఇస్తామని, నిరుద్యోగ భృతి ఏ రూపంలో ఉండాలన్నది కూడా నిర్ణయిస్తామని చెప్పారు. ఈ నెల 29న ఒప్పంద ఉద్యోగుల సమస్యలపై ఉపసంఘం భేటీ అవుతుందన్నారు. ఒప్పంద ఉద్యోగులకు వేతనాలు ఏ స్థాయిలో పెంచాలన్నది ఈ సమావేశంలో నిర్ణయిస్తామని వివరించారు. ఒప్పంద ఉద్యోగుల సంఖ్య, వారి నియామకాల తీరుపై సమీక్షిస్తున్నామని, పొరుగు సేవల సిబ్బంది వేతనాల సవరణపై కూడా నిర్ణయం తీసుకుంటామని యనమల పేర్కొన్నారు. మార్చి 2న మంత్రివర్గంలో ఈ అంశాలన్నింటిపై చర్చించి నిర్ణయం తీసుకుంటామని స్పష్టం చేశారు.

  • Loading...

More Telugu News