: పఠాన్ కోట్ ఘటనపై పాక్ 'సంయుక్త దర్యాప్తు బృందం' నియామకం


పఠాన్ కోట్ ఘటనపై ఇటీవల ఎఫ్ఐఆర్ నమోదు చేసిన పాకిస్థాన్ ఈ వ్యవహారంలో మరింత ముందుకు వెళ్లింది. ఈ ఘటనలో విచారణ జరిపేందుకుగాను పాక్ సంయుక్త దర్యాప్తు బృందాన్ని(జేఐటి) నియమించింది. ఈ విచారణ బృందంలో ఐదుగురు సభ్యులు వుంటారు. పంజాబ్ కౌంటర్ టెర్రరిజం డిపార్ట్ మెంట్ (సీటీడీ) ఎడిషనల్ ఐజీ మహ్మద్ తాహీర్ రాయ్ కన్వీనర్ గా వ్యవహరిస్తారు. ఆయనతో పాటు లాహోర్ డిప్యూటీ డైరెక్టర్ జనరల్ ఇంటెలిజెన్స్ బ్యూరో మహ్మద్ అజిమ్ అర్షద్, ఇంటర్ సర్వీసెస్ ఇంటెలిజెన్స్ (ఐఎస్ఐ) లెఫ్టినెంట్ కల్నల్ తన్వీర్ అహ్మద్, మిలిటరీ ఇంటెలిజెన్స్ లెఫ్టినెంట్ కల్నల్ ఇర్ఫాన్ మీర్జా, గుజ్జరన్ వాలా సీటీడీ ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ షాహిద్ తన్వీర్ సభ్యులుగా ఉంటారు. మార్చిలో ఈ బృందం పఠాన్ కోట్ ఎయిర్ బేస్ ను సందర్శించనుంది. ఇందుకోసం ముందుగా భారత ప్రభుత్వం అనుమతి తీసుకుని పఠాన్ కోట్ ఎయిర్ బేస్ లో సాక్ష్యాలను సేకరించి స్వయంగా దర్యాప్తు జరపనుంది.

  • Loading...

More Telugu News