: నైజీరియాలో ప్రకాశం జిల్లా వ్యక్తి పవన్ కుమార్ కిడ్నాప్
నైజీరియాలో ప్రకాశం జిల్లాకు చెందిన వెంకట పవన్ కుమార్ అపహరణకు గురయ్యాడు. జిల్లాలోని కందుకూరు పట్టణంలోని జనార్దన్ కాలనీకి చెందిన అయిశెట్టి పవన్ ఉద్యోగం కోసం నైజీరియా వెళ్లాడు. అయితే కొన్నిరోజుల నుంచి అతను కనిపించకపోవడంతో కుటుంబ సభ్యులు ఆరా తీశారు. వారం రోజుల నుంచి అతను కిడ్నాపర్ల చెరలో ఉన్నాడని వారికి తెలిసింది. దాంతో పవన్ తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.