: ఖాతాదారులకు కుచ్చుటోపీ పెట్టిన రాంరాజ్ చిట్ ఫండ్
హైదరాబాదులో మరో చిట్ ఫండ్ సంస్థ ఖాతాదారులకు కుచ్చుటోపీ పెట్టింది. అఫ్జల్ గంజ్ లోని రాంరాజ్ చిట్ ఫండ్ సంస్థ బోర్డు తిప్పేసింది. వందల మంది ఖాతాదారుల నుంచి రూ.3 కోట్లకుపైగా వసూలు చేసి చిట్ ఫండ్ యాజమాన్యం మోసగించింది. విషయం తెలుసుకున్న బాధితులు న్యాయం చేయాలంటూ ఆ సంస్థ ముందు ఆందోళన చేశారు. రాంరాజ్ చిట్ ఫండ్ పై అఫ్జల్ గంజ్ పోలీసులకు బాధితులు ఫిర్యాదు చేయగా, సంస్థ యజమాని రాంరాజ్ ను అరెస్టు చేశారు. అనంతరం కోర్టు అతనికి రిమాండ్ విధించింది.