: ఇండియాలో గత సంవత్సరం రిజిస్టరయిన కంపెనీల సంఖ్య 64 వేలు!
2014-15 ఆర్థిక సంవత్సరంలో ఇండియాలో మొత్తం 64,395 వేల కొత్త కంపెనీలు రిజిస్టర్ అయ్యాయి. వీటిల్లో అత్యధికం ఢిల్లీ, మహారాష్ట్ర చిరునామాలతో నమోదైనట్టు శుక్రవారం నాడు మోదీ సర్కారు పార్లమెంటుకు వెల్లడించింది. వీటిల్లో 66 కంపెనీలు స్టాక్ మార్కెట్లో లిస్టింగ్ అయ్యాయని లోక్ సభకు ఇచ్చిన లిఖితపూర్వక సమాధానంలో ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ వెల్లడించారు. మొత్తం కంపెనీల్లో 11,076 ఢిల్లీ కేంద్రంగా రిజిస్టరయ్యాయని, ఆపై మహారాష్ట్ర నుంచి 11,020, యూపీ నుంచి 5,989 కంపెనీలు రిజిస్టరైనట్టు తెలిపారు. మిగిలిన రాష్ట్రాల్లో కర్నాటక నుంచి 5,025, తమిళనాడు నుంచి 4,867, పశ్చిమ బెంగాల్ నుంచి 4,155, తెలంగాణ నుంచి 3,761 కంపెనీలు రిజిస్టరయ్యాయని వివరించారు. ఈ కంపెనీల్లో మొత్తం రూ. 8,826.80 కోట్ల మూలధనం ఉందని తెలిపారు.