: నేపాల్ లో మరో ఘోరం... కూలిన ఇంకో విమానం!


నేపాల్ లో ఘోర విమాన ప్రమాదం జరిగి 23 మంది మరణించిన ఘటన జరిగి రెండు రోజులు కూడా కాకుండానే ఇంకో దుర్ఘటన జరిగింది. ఈ మధ్యాహ్నం 12:15 గంటల సమయంలో నేపాల్ గంజ్ నుంచి జుమ్లాకు వెళుతున్న ఎయిర్ కాస్టామండప్ కు చెందిన 9ఎన్-ఏజేబీ విమానం కూలిపోయింది. కలికోట్ జిల్లాలోని చిల్ ఖాయా సమీపంలో విమానం కుప్పకూలింది. దీనిలో 11 మంది ప్రయాణిస్తున్నట్టు తెలిసింది. ప్రమాదానికి గల కారణాలు తెలియ రాలేదని, సహాయక బృందాలను పంపించామని అధికారులు వెల్లడించారు.

  • Loading...

More Telugu News