: శ్రీమంతుడు దర్శకుడు కొరటాల శివ, హృతిక్ రోషన్ లకు కోర్టు నోటీసులు
ప్రిన్స్ మహేశ్ బాబు హీరోగా సూపర్ హిట్టయిన చిత్రం 'శ్రీమంతుడు' చిత్ర కథ తనదేనంటూ శరత్ చంద్ర అనే రచయిత దాఖలు చేసిన పిటిషన్ పై గురువారం నాడు విచారణ చేపట్టిన హైదరాబాద్ సిటీ సివిల్ కోర్టు అదనపు న్యాయమూర్తి సింగిరెడ్డి ప్రతివాదులకు నోటీసులు జారీ చేశారు. ఇదే కథతో హిందీలో హృతిక్ రోషన్ హీరోగా చిత్ర నిర్మాణం మొదలుకానుందని, ఈ విచారణ పూర్తయ్యే వరకూ దానిపై స్టే విధించాలని శరత్ కోరగా, నోటీసులు పంపాలని న్యాయమూర్తి ఆదేశించారు. శ్రీమంతుడు చిత్ర నిర్మాత ఎర్నేని నవీన్, దర్శకుడు కొరటాల శివ, హృతిక్ రోషన్ లకు నోటీసులు పంపాలని న్యాయమూర్తి ఆదేశించారు. తదుపరి విచారణను మార్చి 4కు వాయిదా వేస్తున్నట్టు తెలిపారు.