: ఓపక్క ఇండియా గెలవాలని... మరోపక్క నేను రాణించాలని సానియా ఎప్పుడూ కోరుకుంటుంది: షోయబ్ మాలిక్


పాకిస్థాన్ క్రికెటర్ ను ఎంత ప్రేమించి వివాహం చేసుకున్నా టెన్నిస్ దిగ్గజ క్రీడాకారిణి సానియామీర్జా మాత్రం ఎప్పుడూ టీమిండియాకే మద్దతిస్తుంది. అందుకే ఎప్పుడూ భారతే గెలవాలని ఆమె కోరుకుంటుందట. ఆసియా కప్ లో భాగంగా భారత్-పాకిస్థాన్ మధ్య రేపు మ్యాచ్ జరగబోతున్న నేపథ్యంలో సానియా అభిప్రాయాన్ని ఆమె భర్త, క్రికెటర్ షోయబ్ మాలిక్ ఓ ఆంగ్ల ఛానల్ ఇంటర్వ్యూలో వెల్లడించాడు. "మేం ఇద్దరం ఎప్పుడూ ఒకలాగే అనుకుంటాం. ఓ భారతీయ మహిళగా, టీమిండియా అభిమానిగా సానియా ఎప్పుడూ ఇండియానే మ్యాచ్ గెలవాలని కోరుకుంటుంది. అదే సమయంలో తన భర్త అయిన తాను పాక్ తరపున బాగా రాణించాలని కోరుకుంటుంది" అని షోయబ్ తెలిపాడు. మిర్పూర్ లోని షేర్ బంగ్లా నేషనల్ స్టేడియంలో రేపు భారత్- పాక్ మ్యాచ్ జరగనుంది.

  • Loading...

More Telugu News