: జాట్ ల ధ్వంస రచనపై మండిపడ్డ చెస్ నేషనల్ ఛాంపియన్... సోషల్ మీడియాలో వీడియో వైరల్
రిజర్వేషన్ల కోసమంటూ హర్యానాలో ఆందోళనకు దిగిన జాట్ కులస్థులు ధ్వంస రచనకు దిగారు. పెద్ద ఎత్తున ప్రభుత్వ, ప్రైవేట్ ఆస్తులను ధ్వంసం చేశారు. ఢిల్లీకి బయలుదేరే అన్ని జాతీయ రహదారులను దిగ్బంధించారు. ఢిల్లీకి తాగు నీటిని అందిస్తున్న మ్యూనక్ కెనాల్ పైపు లైన్లను పగులగొట్టారు. ఫలితంగా రోజుల తరబడి నిత్యావసరాలు, నీళ్లు లేక ఢిల్లీ వాసులు నానా ఇబ్బందులు పడ్డారు. జాట్ల ఆందోళనలపై హర్యానాకే చెందిన చెస్ నేషనల్ ఛాంపియన్ అనురాధా బెనివాల్ మండిపడ్డారు. తమ సొంత ఇళ్లకు నిప్పు పెట్టుకున్నారంటూ జాట్ లపై ఆమె అంతెత్తున ఎగిరిపడ్డారు. కుల, మతాలకు అతీతంగా తన కోచ్ లు తనకు చెస్ లో నైపుణ్యాన్ని నేర్పారని ఆమె పేర్కొన్నారు. ఈ సందర్భంగా జాట్ల ఆందోళనపై ఘాటు వ్యాఖ్యలతో కూడా ఆమె ప్రసంగంతో కూడిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయిపోయింది.