: న్యూయార్క్ టైమ్స్ స్క్వేర్ లో 'చిన్నారి పెళ్లికూతురు'... పెళ్లికొడుకుపై తిట్ల వర్షం... ఆ కథ చదవండి!


ఇండియాలో బాల్య వివాహాలు జరుగుతాయని అందరికీ తెలుసు. మరి అమెరికాలోనూ అలాగే జరిగితే... అది కూడా న్యూయార్క్ లోని ప్రముఖ టూరిస్ట్ స్పాట్ 'టైమ్స్ స్క్వేర్'లో. మరిన్ని వివరాల్లోకి వెళితే, 65 ఏళ్ల సూటు, బూటు ధరించిన ఓ వ్యక్తి, తెల్లటి గౌనులో అందంగా కనిపిస్తున్న 12 ఏళ్ల బాలిక చెయ్యి పట్టుకుని అక్కడి మెట్లపై చిరునవ్వు చిందిస్తూ కూర్చున్నాడు. బాలిక మాత్రం బేల చూపులు చూస్తూ భయంగా నేలవైపు చూస్తోంది. ఆపై ఏం జరిగిందో తెలుసా? ఓ వ్యక్తి వచ్చాడు. "మీ అమ్మ ఎక్కడ?" అని బాలికను అడిగాడు. బాలిక సమాధానం చెప్పలేదు. మరోసారి అడిగేసరికి 'ఆమె ఇంట్లో ఉంది' అని చెప్పింది. అదే సమయానికి అక్కడికొచ్చిన ఓ మహిళ, "పాప చాలా చిన్న అమ్మాయి" అంది. అందుకా పెద్దాయన, "నిజమే. కానీ వాళ్ల తల్లిదండ్రులు నాకు అనుమతిచ్చారు" అన్నాడు. ఈలోగా అక్కడికి ప్రజలు చేరిపోయారు. బాలికను వివాహం చేసుకున్న ఆ ముదుసలిని ఎడాపెడా తిట్టిపారేశారు. ఇది సరైన చర్య కాదంటూ, నువ్వో శాడిస్టువంటూ ఏకేశారు. అతనిపై దాడి చేసేందుకు కూడా కొందరు ప్రయత్నించారు. దీన్నంతా కొందరు తమ వీడియోల్లో చిత్రీకరించారు కూడా. అందరూ చివరికి అసలు విషయాన్ని తెలుసుకుని అక్కడి నుంచి వెళ్లిపోయారు. బాల్య వివాహాలను అడ్డుకోవడంలో న్యూయార్క్ వాసులు ఎంత ముందుంటారో తెలుసుకోవడం కోసం కోబీ పెర్సిన్ అనే వ్యక్తి చేసిన ప్రయత్నమే ఇది. 2050 నాటికి ప్రపంచంలో 120 కోట్ల మంది బాలికలకు వయసు రాకుండానే వివాహాలు జరగనున్నాయని యునైటెడ్ నేషన్స్ పాపులేషన్ ఫండ్ అంచనాలు వెలువరించిన నేపథ్యంలో, ప్రజల్లో అవగాహన తెచ్చేందుకు కోబీ ఇలా చేశాడట. "న్యూయార్క్ వాసులు బాల్య వివాహాలను అంగీకరించరు" అంటూ యూట్యూబ్ లో పెట్టిన ఈ ఉదంతం వీడియో ఇప్పుడు వైరల్.

  • Loading...

More Telugu News