: అమెరికాలో ఎన్నారై యువతి కిడ్నాప్ సుఖాంతం... కిడ్నాపర్ల నుంచి విడిపించిన పోలీసులు
అమెరికాలో భారత్ కు చెందిన ఓ యువతి కిడ్నాపైన ఘటనపై ఆ దేశ పోలీసులు వేగంగా స్పందించారు. ఫిర్యాదు అందిన క్షణాల్లో రంగంలోకి దిగిన అమెరికా పోలీసులు కిడ్నాపర్ల ఆట కట్టించి వారి చెర నుంచి ఎన్నారై యువతికి విముక్తి కల్పించారు. ఆ తర్వాత ఆ యువతిని ఆమె బంధువులకు సురక్షితంగా అప్పగించారు. వివరాల్లోకెళితే... అమెరికాలోని ఫిలడెల్ఫియాలో ఉంటున్న పూజిత అనే యువతిని ఇటీవల కొందరు గుర్తు తెలియని వ్యక్తులు కిడ్నాప్ చేశారు. దీనిపై బాధిత యువతి కుటుంబ సభ్యుల నుంచి ఫిర్యాదు అందుకున్న పోలీసులు వేగంగా స్పందించారు. అన్ని కోణాల్లో దర్యాప్తు చేసిన పోలీసులు కిడ్నాపర్ల రహస్య స్థావరాన్ని ఎట్టకేలకు కనిపెట్టారు. దానిపై మూకుమ్మడిగా దాడి జరిపి కిడ్నాపర్ల చెరలోని పూజితను సురక్షితంగా కాపాడారు. కొద్దిసేపటి క్రితం ఆమెను ఆమె కుటుంబ సభ్యులకు అప్పజెప్పారు.