: 28 ఏళ్ల యువతితో పాప్ స్టార్ తండ్రి పెళ్లి


యువ పాప్ స్టార్ జస్టిన్ బీబర్ తండ్రి జెరెమీ బీబర్ మళ్లీ పెళ్లికి సిద్ధమయ్యాడు. కొంతకాలంగా చెల్సీ రెబెలో అనే 28 ఏళ్ల యువతితో ఆయన సహజీవనం చేస్తున్నాడు. ఈ క్రమంలో సెయింట్ బార్ట్స్ ప్రాంతానికి వాళ్లిద్దరూ వెళ్లిన సమయంలో జెరెమీ ఆమెకు ప్రపోజ్ చేశాడు. ఆ వెంటనే చెల్సీకి ఉంగరాన్ని కూడా తొడిగాడు. ఈ సందర్భంగా తీసిన వీడియోను 41 ఏళ్ల జెరెమీనే ట్విట్టర్ లో పోస్టు చేసి విషయాన్ని వెల్లడించాడు. అంతేకాదు ఉంగరం తొడుగుతుండగా తీసిన ఫోటోను కూడా పోస్టు చేశాడు. చెల్సీతో కొత్త జీవితాన్ని ప్రారంభించబోతున్నట్టు తెలిపాడు. గతంలో పేటీ మాలెట్ ను వివాహం చేసుకున్న జెరెమీ, బీబర్ పుట్టాక ఇద్దరూ విడిపోయాడు.

  • Loading...

More Telugu News