: పార్లమెంటులో ఎకనామిక్ సర్వేను ప్రవేశపెట్టిన జైట్లీ
2016 ఎకనామిక్ సర్వే ను ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ పార్లమెంట్ ముందుకు తీసుకొచ్చారు. ద్రవ్యలోటు లక్ష్యం 3.9 శాతమని తెలిపిన ఆయన, దాన్ని అధిగమించడం సాధ్యమేనని తెలిపారు. ఈ సంవత్సరం వృద్ధి రేటు 7 శాతానికి ఎగువకు నమోదవుతుందని, వచ్చే ఆర్థిక సంవత్సరంలో వృద్ధి రేటు 7 నుంచి 7.5 శాతం మధ్య ఉంటుందని అంచనా వేస్తున్నట్టు వివరించారు. కాగా, బ్యాంకులను ఆదుకునేందుకు ప్రభుత్వం ముందుంటుందని, మూలధన కొరతను తీర్చేందుకు కృషి చేస్తామని పేర్కొన్నారు. ప్రపంచంలోనే శరవేగంగా అభివృద్ధిలో దూసుకెళ్తున్న ఇండియాకు సమీప భవిష్యత్తులో విదేశీ పెట్టుబడులు విరివిగా రానున్నాయని అన్నారు.