: మేం లొంగిపోయే ప్రసక్తే లేదు: జేఎన్ యూ విద్యార్థులు


దేశద్రోహం కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న జేఎన్ యూ స్టూడెంట్స్ యూనియన్ జనరల్ సెక్రెటరీ రామనాగా, అశుతోష్ కుమార్, అనంత్ ప్రకాశ్ లు పోలీసులకు లొంగిపోయేందుకు ససేమిరా అంటున్నారు. అసలు పోలీసులకు తాము సరెండర్ అవ్వాల్సిన అవసరమేంటని ఎదురు ప్రశ్నించారు. "మేం ఎందుకు సరెండర్ కావాలి? మేం పోలీసులకు హాస్టల్ నెంబర్ ఇచ్చాం. రూమ్ నెంబర్, కాంటాక్ట్ వివరాలు కూడా ఇచ్చాం. ప్రస్తుతం మేం జేఎన్ యూ క్యాంపస్ లోనే ఉన్నాం. ఇక నిర్ణయించుకోవాల్సింది పోలీసులే" అని ముగ్గురిలో ఒకరైన అనంత్ ప్రకాశ్ జాతీయ మీడియాతో చెప్పాడు. ఢిల్లీ కోర్టు ఆదేశాలతో ఇప్పటికే ఉమర్ ఖలీద్, అనిర్బన్ భట్టాచార్యలు పోలీసుల ముందు సరెండర్ అయిన సంగతి తెలిసిందే.

  • Loading...

More Telugu News