: మారిన పీఎఫ్ విత్ డ్రా నిబంధనలు!
దేశంలోని 5 కోట్ల మంది పీఎఫ్ ఖాతాదారులకు ఇది ఓ రకంగా దుర్వార్తే. పీఎఫ్ విత్ డ్రా నిబంధనలను సవరిస్తూ ఈపీఎఫ్ఓ (ఎంప్లాయీ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్) నిర్ణయం తీసుకుంది. మారిన నిబంధనల ప్రకారం, ఖాతాదారుడికి 54 సంవత్సరాలు వచ్చిన తరువాత పీఎఫ్ విత్ డ్రాలను ఇకపై అంగీకరించరు. 57వ సంవత్సరంలోకి వచ్చిన తరువాతే డబ్బును తీసుకోవడానికి వీలవుతుంది. ఇప్పటివరకూ 54 సంవత్సరాల వయసులో కూడా 90 శాతం వరకూ ఖాతాలను క్లయిమ్ చేసుకునే సదుపాయం ఉందన్న సంగతి తెలిసిందే. కాగా, పీఎఫ్ విభాగంలో సంయుక్త కార్యదర్శి స్థాయి అధికారుల నియామకం సీబీటీ (సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్)కి అప్పగిస్తూ కూడా ఈపీఎఫ్ఓ నిర్ణయం తీసుకుంది.