: ఆసియా కప్ లో లంక కూడా బోణీ కొట్టింది!


ఆసియా కప్ లో టీమిండియా మాదిరే మరో కీలక జట్టు శ్రీలంక కూడా బోణీ కొట్టేసింది. నిన్న బంగ్లాదేశ్ లోని మిర్పూర్ లో జరిగిన టీ20 మ్యాచ్ లో లంక జట్టు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్(యూఏఈ) జట్టుపై 14 పరుగుల తేడాతో విజయం సాధించింది. మొదట బ్యాటింగ్ చేసిన లంక జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 129 పరుగులు చేసింది. ఓపెనర్ గా బరిలోకి దిగిన లంక జట్టు కెప్టెన్ దినేశ్ చండీమాల్ (50), మరో ఓపెనర్ తిలకరత్నే దిల్షాన్ (27) రాణించారు. వీరిద్దరూ ఔటైన తర్వాత లంక బ్యాట్స్ మెన్ పెవిలియన్ కు క్యూ కట్టారు. దీంతో లంక జట్టు స్వల్ప స్కోరే చేసింది. ఆ తర్వాత 130 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన యూఏఈ... 20 ఓవర్ల పాటు బ్యాటింగ్ చేసినా, 9 వికెట్ల నష్టానికి 115 పరుగులే చేయగలిగింది. దీంతో 14 పరుగుల తేడాతో లంక జట్టు గెలిచింది. యూఏఈ జట్టు కెప్టెన్ స్వప్నిల్ పాటిల్ (37) ఒక్కడే కాస్త రాణించాడు. ఇక లంక బౌలింగ్ కు నేతృత్వం వహించిన లసిత్ మలింగ... నాలుగు ఓవర్లలో నాలుగు వికెట్లు పడగొట్టి యూఏఈ బ్యాటింగ్ వెన్ను విరిచాడు. మలింగతో పాటు మరో బౌలర్ హెరాత్ కూడా సత్తా చాటడంతో యూఏఈ బ్యాట్స్ మెన్ పరుగులు రాబట్టేందుకు నానా ఇబ్బందులు పడ్డారు.

  • Loading...

More Telugu News