: మరో వివాదంలో తలసాని... జీహెచ్ఎంసీ ఉద్యోగిపై మంత్రి బంధువుల దాడి, కేసు నమోదు


జంట నగరాల్లో టీఆర్ఎస్ కు బలమైన నేత, తెలంగాణ వాణిజ్య పన్నుల శాఖ మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్ మరో వివాదంలో చిక్కుకున్నారు. పాత కక్షల నేపథ్యంలో తలసాని సోదరుడు కుమారుడి అనుచరులు సాయికుమార్ అనే గ్రేటర్ హైదరాబాదు మునిసిపల్ కార్పొరేషన్ (జీహెచ్ఎంసీ)ఉద్యోగిపై దాడికి దిగారు. నిన్న రాత్రి సికింద్రాబాదులోని బోయగూడ పరిధిలోని ఐడీహెచ్ కాలనీలో చోటుచేసుకున్న ఈ ఘటనలో సాయికుమార్ తీవ్రంగా గాయపడ్డాడు. సాయికుమార్ ను ఆసుపత్రికి తరలించిన అతడి బంధువులు ఆ తర్వాత పోలీసులకు ఫిర్యాదు చేశారు. మంత్రి తలసాని బంధువులే సాయికుమార్ పై దాడి చేశారని సదరు ఫిర్యాదులో వారు పేర్కొన్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

  • Loading...

More Telugu News