: ఫేస్ బుక్ ద్వారా ఆయుధాలు పోగేస్తున్న ఉగ్రవాదులు


ప్రపంచానికి పెను సవాల్ గా మారిన ఐసిస్ ఉగ్రవాదులు ఫేస్ బుక్ వంటి సామాజిక మాధ్యమాల ద్వారా విధ్వంసకర ఆయుధాలను పోగేసుకుంటున్న విషయం వెలుగులోకి వచ్చింది. ఐసిస్ తోపాటు అల్ ఖైదా ఉగ్రవాదులు ఫేస్ బుక్ ద్వారా ఆయుధాల విక్రయం, కొనుగోలు వ్యవహారాలు నడుపుతున్నట్టు డైలీ మిర్రర్ కథనం పేర్కొంది. పౌర, సైనిక విమానాలను కూల్చివేసే శక్తిగల మిస్సైల్ లాంచర్ ను ‘ద ఫస్ట్ వెపన్స్ మార్కెట్ ఇన్ ఇడ్లిబ్ (సిరియా) కంట్రీ సైడ్’ అనే ఫేస్ బుక్ పేజీలో 67వేల డాలర్లకు విక్రయానికి ఉంచినట్టు పేర్కొంది. విక్రయదారులు సిరియాలో ఉగ్రవాదులపై పోరాడుతున్న రెబల్స్ అని, ఇలాంటి ఆయుధాలు ఐసిస్ ఉగ్రవాదులకు సులభంగా చేరే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేసింది. ఇదే పేజీలో ‘ఫ్రెండ్స్, వెంటనే సైలెన్సర్ ఉన్న ఒక గన్ నాకు కావాలి‘ అనే మెస్సేజీ... టీవోడబ్ల్యూ మిస్సైల్ లాంచర్ విక్రయించనున్నట్టు ఓ ప్రకటన కూడా ఉందని మిర్రర్ వెల్లడించింది. అంతేకాదు ఈ మిస్సైల్ లాంచర్ ఏకంగా అమెరికా నుంచే వస్తున్నట్టు విక్రయదారుడు ప్రకటించడాన్ని ప్రస్తావించింది. అమెరికా విదేశీ గూఢచార సంస్థ సీఐఏ సిరియాలో ఐసిస్ ఉగ్రవాదులపై పోరాటం కోసం ప్రత్యర్థి బలగాలకు టీవోడబ్ల్యూ మిసైల్స్ ను అందిస్తోంది. అవి ఇప్పుడు పక్కదారి పట్టి ఉగ్రవాదుల చేతుల్లో పడుతున్నట్టు మిర్రర్ కథనం ఆధారంగా తెలుస్తోంది.

  • Loading...

More Telugu News