: ట్వంటీ 20 మ్యాచుల టికెట్లకు మొదలైన ఆన్ లైన్ బుకింగ్
ట్వంటీ 20 క్రికెట్ కప్-2016లో భాగంగా భారత్ తలపడే అన్ని మ్యాచులు, సెమీ ఫైనల్స్ (మహిళలు, పురుషులు), ఫైనల్స్ (మహిళలు, పురుషులు) మ్యాచుల వీక్షణకు టికెట్ల కొనుగోలుకు రిజిస్ట్రేషన్ గురువారం నుంచి ప్రారంభమైంది. ఆన్ లైన్ లో లాటరీ విధానంలో ఈ మ్యాచుల టికెట్లను విక్రయించనున్నట్టు భారతీయ క్రికెట్ కంట్రోల్ బోర్డ్ ప్రకటించింది. ఆన్ లైన్ లో నమోదు చేసుకున్న వారి నుంచి లాటరీ విధానంలో ఎంపిక చేసి వారికి టికెట్లను విక్రయించనున్నట్టు బోర్డు తెలిపింది. మార్చి 2వ తేదీ సాయంత్రం 5 గంటలకు రిజిస్ట్రేషన్ ముగియనుంది. https://in.bookmyshow.com/sports/cricket/icc-worldt20-2016 లింక్ లో రిజిస్ట్రేషన్ ఫామ్ ను పూర్తి చేయడం ద్వారా నమోదు చేసుకోవాలని బీసీసీఐ సూచించింది. డ్రాలో విజేతలైన వారికి టికెట్ల కొనుగోలుకు అవకాశం కల్పిస్తారు. బుక్ మై షో టికెట్ ఏజెన్సీ సేవలను బీసీసీఐ ఇందుకు ఉపయోగించుకుంటోంది.