: రైల్వే బడ్జెట్ పై ప్రముఖుల స్పందనలు
* ముడిచమురు ధరలు తగ్గాయి, వాటికనుగుణంగా రైలు టిక్కెట్ ధరలు కూడా తగ్గించాల్సి ఉంది. కానీ ఆ పని చేయలేదు. ఇది నిరుపయోగ బడ్జెట్: బీహార్ సీఎం నితీశ్ కుమార్ * వాస్తవిక పరిస్థితుల ఆధారంగా రైల్వేకు మరింత ప్రాచుర్యం కల్పిస్తున్నారు: కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు * బడ్జెట్ లో మంత్రి సురేశ్ ప్రభు ఏం చెప్పారో అర్థం కాలేదు. ఆయన్ను స్వయంగా కలసి తెలుసుకోవాలి: ఎన్సీపీ నాయకురాలు సుప్రియా సూలే * కొత్త ప్రకటనల సంగతేమో కానీ గత బడ్జెట్ లో చేసిన ప్రతిపాదనల అమలు గురించి చెప్పలేదు: బీఎస్పీ అధినేత్రి మాయావతి * మహిళలను దృష్టిలో ఉంచుకుని, పెట్టుబడులను ఆకర్షించేలా రూపొందించారు: పెట్రోలియం మంత్రి ధర్మేంద్ర ప్రదాన్ * నిస్సారంగా ఉంది: కాంగ్రెస్ నేత ఎం.సింఘ్వీ * నిరుపేదల, సంస్కరణల బడ్జెట్.. 10కి తొమ్మిది మార్కులు వేస్తా: కేంద్ర మంత్రి ప్రకాశ్ జవదేకర్ * బడ్జెట్ లోని హామీలు ఆచరణ సాధ్యం కాదు: లోక్ సభలో కాంగ్రెస్ నేత మల్లికార్జున ఖర్గే