: ‘మహిళల పట్ల అనుచిత ప్రవర్తన‘పై ఆర్మీ స్పందన
జాట్ల రిజర్వేషన్ల ఉద్యమం సందర్భంగా హర్యానాలోని సోనిపత్ జిల్లాలో ఆందోళనకారులు మహిళల పట్ల అనుచిత ప్రవర్తన, అఘాయిత్యాలకు పాల్పడ్డారంటూ వ్యక్తమవుతున్న ఆరోపణలను ఆర్మీ ఖండించింది. తాము సోనిపత్ లో రంగంలోకి దిగిన తర్వాత అలాంటి ఘటన ఒక్కటీ చోటు చేసుకోలేదని స్పష్టం చేసింది. చైన్ స్నాచింగ్ ఘటనలు మినహా ఫిబ్రవరి 20 నుంచి ఇప్పటి వరకు మహిళల పట్ల అనుచితంగా ప్రవర్తించిన సంఘటన ఒక్కటీ లేదని ప్రకటించింది. ఫిబ్రవరి 22న ఉదయం సోనిపత్ జిల్లాలోని ముర్తాల్ ప్రాంతంలో సుమారు 10 మంది మహిళలపై లైంగిక దాడి జరిగినట్టు వార్తలు బయటకు వెలుగు చూసిన విషయం తెలిసిందే. అయితే, ఈ విషయం ఎవరికీ చెప్పొద్దంటూ బాధితులు, వారి కుటుంబ సభ్యులను జిల్లా అధికారులు కోరినట్టు వార్తలు గుప్పుమంటున్నాయి.