: శ్రీకాళహస్తిలో సినీ నటుడు గోపీచంద్ దంపతుల రాహుకేతు పూజలు


భార్య రేష్మి, కుమారుడుతో కలసి సినీ నటుడు గోపీచంద్ ఈ రోజు శ్రీకాళహస్తీశ్వరుడిని దర్శించుకున్నారు. అనంతరం ఆలయంలో రాహుకేతు పూజలు నిర్వహించారు. అంతకుముందు గోపీచంద్ దంపతులు తిరుమల శ్రీవారిని వీఐపీ విరామ సమయంలో దర్శించుకున్నారు. కుమారుడి పుట్టువెంట్రుకలు తీయించి, మొక్కు చెల్లించుకున్నట్టు గోపీచంద్ తెలిపారు. స్వామివారిని దర్శించుకోవడం చాలా సంతోషంగా ఉందన్నారు.

  • Loading...

More Telugu News