: ఫోర్బ్స్ జాబితాలో కోహ్లీ, సానియా, సైనా


గత కొన్నేళ్ల నుంచి భారత క్రికెట్, టెన్నిస్, బ్యాడ్మింటన్ లో దూసుకుపోతున్న విరాట్ కోహ్లీ, సానియా మీర్జా, సైనా నెహ్వాల్ లు ఫోర్బ్స్ 'ప్రామిసింగ్ యంగ్ లీడర్స్ అండ్ గేమ్ ఛేంజర్స్' జాబితాలో నిలిచారు. ఆసియాఖండంలో 30 సంవత్సరాలలోపు అత్యంత ప్రతిభగల క్రీడాకారులను 300 మందిని ఫోర్బ్స్ ఎంపిక చేసింది. అందులో 56 మంది భారతీయులకు స్థానాలు దక్కాయి. వారిలో కోహ్లీ, సానియా, సైనా ముందు వరసలో నిలవడం విశేషం. కోహ్లీ ఆధ్వర్యంలో ఇటీవల భారత జట్టు టీ20 సిరీస్ ను క్లీన్ స్వీప్ చేసిందని, అంతేగాక, భారత్ లో ఆయన అత్యధికంగా ఏడాదికి 11.3 మిలియన్ డాలర్లు ఆర్జించారని ఫోర్బ్స్ పేర్కొంది. గత సంవత్సరంపైగా భారత టెన్నిస్ లో సానియా విజయవంతమైన క్రీడాకారిణిగా కొనసాగుతున్నారని, సైనా భారత బ్యాడ్మింటన్ క్వీన్ అని ఫోర్బ్స్ ప్రశంసించింది.

  • Loading...

More Telugu News