: రైల్వే బడ్జెట్ ముఖ్యాంశాలు-2


2016-17 సంవత్సరానికి గాను రైల్వే బడ్జెట్ పార్లమెంట్ ముందుకు వచ్చింది. రైల్వే మంత్రి సురేష్ ప్రభు చేసిన ప్రతిపాదనల్లోని మరిన్ని ముఖ్యాంశాలు... * జపాన్ సాయంతో ఢిల్లీ, అహ్మదాబాద్ మధ్య హైస్పీడ్ రైల్వే లైన్ * శతాబ్ది, రాజధాని ఎక్స్ ప్రెస్ లకే పరిమితమైన 'రైల్ బంధు' పత్రిక ఇక అన్ని రైళ్లలో అందుబాటులోకి. * అన్ని రీజనల్ భాషల్లో ముద్రితం కానున్న రైల్ బంధు పత్రిక. * అన్ని తత్కాల్ కౌంటర్లలో సీసీ కెమెరాలతో నిఘా. * బ్రోకర్లకు అడ్డుకట్ట వేసి తీరుతాం. * ప్రయాణికులు ఎస్ఎంఎస్ చేస్తే, పక్క స్టేషన్లలోనే బోగీలు, మరుగుదొడ్ల శుభ్రత. * ఐఆర్సీటీసీ ద్వారా మరిన్ని స్టేషన్లలో ఆహార సరఫరా ఏర్పాట్లు. * పాలు, అత్యవసర ఔషధాలు సైతం అందుబాటులోకి. * బుకింగ్ సమయంలోనే ప్రయాణ బీమా సౌకర్యం. * స్టేషన్లలో పిల్లల కోసం బేబీ ఫుడ్, వేడి పాలు, నీళ్ల సౌకర్యం. * తెలంగాణ ప్రభుత్వ సహకారంతో హైదరాబాద్ సబర్బన్ నెట్ వర్క్ విస్తృతికి చర్యలు. * ఆధ్యాత్మిక కేంద్రాల్లోని రైల్వే స్టేషన్ల అభివృద్ధికి కొత్త పథకం. * తొలి దశలోనే తిరుపతి రైల్వే స్టేషన్ కు అవకాశం. * ఎంపిక చేసిన రైళ్లలో స్మార్ట్ రైల్వే కోచ్ లు. * రాజధాని, శతాబ్ది సహా అన్ని మెయిల్ ఎక్స్ ప్రెస్ రైళ్లలో ప్రయాణికుల వినోదం కోసం ఎఫ్ఎం రేడియో సేవలు. * ఢిల్లీ ప్రభుత్వ సహకారంతో కాలుష్య రహిత రైల్వే మార్గాల అభివృద్ధి * 130 కి.మీ వేగంతో ప్రయాణించే తేజాక్ ఎక్స్ ప్రెస్ లను ప్రారంభిస్తాం. * 408 స్టేషన్లకు విస్తరించనున్న ఈ-క్యాటరింగ్ సేవలు. * టికెట్ రిజర్వేషన్లలో 33 శాతం మహిళలకు కేటాయింపు. * 2 వేల స్టేషన్లలో 20 స్క్రీన్లపై ప్రయాణికుల వివరాల డిస్ ప్లే. * 2016-17 ఆదాయ లక్ష్యం రూ. 1.84 లక్షల కోట్లు. * ప్రణాళికా వ్యయం రూ. 1.21 లక్షల కోట్లు. * పెండింగ్ లో ఉన్న ప్రాజెక్టులన్నీ వచ్చే మూడేళ్లలో పూర్తి. * ప్యాసింజర్ రైళ్ల వేగం 60 కిలోమీటర్లకు, ఎక్స్ ప్రెస్ రైళ్ల వేగం 80 కిలోమీటర్లకు పెంచుతాం. * వెయ్యి రైళ్లలో బయో టాయ్ లెట్ల ఏర్పాటు. * 1350 క్రాసింగ్ ల వద్ద రైల్ ఓవర్ బ్రిడ్జ్ లకు ప్రతిపాదనలు. * నాగపూర్ - విజయవాడల మధ్య వాణిజ్య కారిడార్. * ప్రధాన పుణ్యక్షేత్రాలకు ప్రత్యేకంగా ఆస్థా రైళ్లు. * చెన్నై కేంద్రంగా మొట్టమొదటి భారతీయ రైల్వే ఆటో హబ్. * వికలాంగుల కోసం రైళ్లలో ప్రత్యేక టాయ్ లెట్లు. * 2017లో 2,800 కి.మీ మేర కొత్త రైల్వే మార్గాల నిర్మాణం. * ఖరగ్ పూర్ నుంచి విజయవాడ మధ్య మూడవ లైన్. * జమ్మూ కాశ్మీర్ లో కొనసాగుతున్న పలు టన్నెల్ ప్రాజెక్టులు వేగవంతం. * 9 కోట్ల పనిదినాల ఉపాధి కల్పించడం రైల్వే లక్ష్యం. * దీర్ఘకాల కోరికలన్నీ 2020 నాటికి సాకారం చేసేలా ప్రణాళికలు. * కాపలా రహిత క్రాసింగ్ లన్నీ తొలగించేందుకు చర్యలు.

  • Loading...

More Telugu News