: లక్షా 21వేల కోట్ల రూపాయలతో రైల్వే బడ్జెట్
2016-17 రైల్వే బడ్జెట్ ను లక్షా 21వేల కోట్ల రూపాయలతో ప్రవేశపెడుతున్నట్టు కేంద్ర రైల్వే మంత్రి సురేశ్ ప్రభు తెలిపారు. రైల్వే చార్జీలు పెంచకుండా ప్రత్యామ్నాయాలపై దృష్టి పెడుతున్నామన్నారు. పెండింగ్ ప్రాజెక్టులన్నీ 3 సంవత్సరాల్లో పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు. అంతేగాక ఈ సంవత్సరం రైల్వే పెట్టుబడులు రెట్టింపు చేస్తామని చెప్పారు. రూ.1.5 లక్షల కోట్ల పెట్టుబడులకు ఎల్ఐసీ అనుమతి తెలిపిందని ప్రభు వెల్లడించారు. గత బడ్జెట్ లో ప్రకటించిన 139 పనులను అమలు చేస్తున్నామన్నారు.