: అందరి కోసం ఈ బడ్జెట్: సురేశ్ ప్రభు


లోక్ సభ ముందుకు రైల్వే బడ్జెట్ వచ్చేసింది. కొద్దిసేపటి క్రితం సభ ప్రారంభం కాగానే, అన్ని వాయిదా తీర్మానాలనూ తిరస్కరించిన స్పీకర్ సుమిత్రా మహాజన్, రైల్వే బడ్జెట్ ను ప్రవేశపెట్టాలని కోరారు. రైల్వే బడ్జెట్ ను అందరికోసమూ తయారు చేశామని వెల్లడించిన సురేశ్ ప్రభు తన ప్రసంగాన్ని ప్రారంభించారు. "నేను రైల్వే మంత్రిగా దేశంలోని ఎన్నో ప్రాంతాలను, రైల్వే స్టేషన్లను, అక్కడి సౌకర్యాలనూ పరిశీలించాను. ముంబై సెంట్రల్ స్టేషన్ కు వెళ్లినప్పుడు, అక్కడ కొందరు మహిళలు పరిసరాలను శుభ్రం చేస్తుండటాన్ని చూశాను. స్టేషన్ చాలా శుభ్రంగా ఉంది. ఒక ఎన్జీవో సంస్థ ఈ పని చేస్తోందని తెలిసి ఆశ్చర్యం వేసింది. దేశ పరిశుభ్రత కోసం ప్రారంభమైన 'స్వచ్ఛభారత్'లో భాగంగా ఈ పని చేస్తున్నామని, ఇందుకు సంతోషంగా ఉందని ఓ మహిళ చెప్పడం ఎంతో గర్వకారణం అనిపించింది. సోషల్ మీడియా విస్తృతంగా వ్యాపించిన ఈ రోజుల్లో రైల్వే ప్రయాణికుల సమస్యలు ఎన్నో సత్వరం పరిష్కారమవుతున్నాయి. ఈ బడ్జెట్ ప్రతి రైల్వే ఉద్యోగి, ప్రతి భారత పౌరుడికీ సంబంధించినది. అన్ని రంగాలతో, ఉద్యోగ సంఘాలతో, రైల్వే విభాగాలతో సంప్రదింపుల అనంతరం, ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో తయారు చేశాము. ఇండియా అభివృద్ధికి వెన్నెముకగా ఉన్న రైల్వేలను మరింత ఉన్నత స్థితికి తీసుకువెళ్లడమే నా ఉద్దేశం. ఈ బడ్జెట్ ప్రజల జీవితాల్లో మార్పు తీసుకువస్తుంది. ఇది సామాన్యుల బడ్జెట్" అన్నారు.

  • Loading...

More Telugu News