: స్వేచ్ఛ కోసం పోరాటం అంత సులభం కాదు: సంజయ్ దత్


1993 ముంబై పేలుళ్ల కేసులో ఎరవాడ జైలు నుంచి విడుదలైన అనంతరం పూణె ఎయిర్ పోర్టులో బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ తొలిసారి మీడియాతో మాట్లాడాడు. స్వేచ్ఛ కోసం పోరాటం అంత సులభం కాదని, తన అభిమానుల వల్లే తాను స్వేచ్ఛ పొందగలిగానని సంజయ్ అన్నాడు. ఇన్నాళ్లు అభిమానులు తనపై చూపిన ప్రేమ, మద్దతుకు ఈ సందర్భంగా కృతజ్ఞతలు చెబుతున్నానని తెలిపాడు. పూణె నుంచి ముంబై ఎయిర్ పోర్టుకు చేరుకోనున్న సంజూ ముందుగా తన తల్లి నర్గీస్ సమాధిని దర్శించుకుంటాడు. అనంతరం బాంద్రాలోని తన నివాసానికి వెళతాడు. పూణెలో సంజయ్ ను రిసీవ్ చేసుకునేందుకు భార్య మాన్యత, దర్శకుడు, స్నేహితుడు రాజ్ కుమార్ హిరాణీ వచ్చారు.

  • Loading...

More Telugu News