: కారులో ప్రియురాలితో... ప్రాణాలు తీసిన యువకుడి ఆత్రం!
వేగంగా వెళుతున్న కారులో, పక్కనే ప్రియురాలితో మామూలుగా ముచ్చట్లు పెట్టుకుంటేనే డ్రైవింగ్ నుంచి దృష్టి మరలుతుంది. ఇక మరింత దగ్గరగా ప్రియురాలుండి, డ్రైవింగ్ చేస్తూనే ఉంటే... ఇటువంటి పరిస్థితుల్లోనే ఓ ఢిల్లీ యువకుడి కథ విషాదాంతమైంది. పోలీసులు వెల్లడించిన మరిన్ని వివరాల ప్రకారం, పురాన్ పూర్ కు చెందిన 31 సంవత్సరాల యువకుడు, పిలిభిత్ లోని తన ప్రియురాలిని పికప్ చేసుకుని జాతీయ రహదారిపై కారులో వెళుతూ ప్రమాదానికి గురయ్యాడు. యాక్సిడెంట్ జరిగిన సమయంలో వీరిద్దరూ అత్యంత సన్నిహితంగా ఉన్నారు. వారి ఒంటిపై బట్టలు కూడా లేవు. రోడ్డు పక్కన ఆగివున్న ఓ ట్రక్ ను వీరి కారు బలంగా ఢీకొంది. వీరిదైన ధ్యాసలో పడి ట్రక్ ను గమనించక పోవడమే ప్రమాదానికి కారణమని పోలీసులు తెలిపారు. కేసు నమోదు చేసి దర్యాఫ్తు చేస్తున్నట్టు వెల్లడించారు.