: వైకాపాకు మరింత నష్టం... మైదుకూరు, రైల్వే కోడూరు ఎమ్మెల్యేలు రఘురామిరెడ్డి, శ్రీనివాసులు కూడా జంప్?


కడప గడపలో వైకాపాకు మరింత నష్టం జరగనుందా? గడచిన 12 గంటలుగా జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే అవుననిపిస్తోంది. ఓ పక్క నారా లోకేశ్ ఆధ్వర్యంలో ఆపరేషన్ ఆకర్ష్ జోరుగా సాగుతుండగా, మరోవైపు జగన్ నష్ట నివారణ చర్యల్లో భాగంగా ఎమ్మెల్యేలతో సమావేశమయ్యారు. నిన్న సాయంత్రం ఢిల్లీ నుంచి తిరిగి వచ్చిన జగన్, నేరుగా పులివెందుల చేరుకుని ఎమ్మెల్యేలతో సమావేశం నిర్వహించగా, దీనికి మైదుకూరు ఎమ్మెల్యే రఘురామిరెడ్డి, రైల్వే కోడూరు ఎమ్మెల్యే శ్రీనివాసులు హాజరు కాకపోవడం గమనార్హం. ఇప్పటికే వీరిద్దరూ కూడా టీడీపీలో చేరుతున్నారన్న వార్తలు హల్ చల్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఇక వీరితో కనీసం ఫోన్ లో మాట్లాడాలని జగన్ చేసిన ప్రయత్నాలు కూడా విఫలమైనట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో వీరిద్దరూ నేడో, రేపో పచ్చ కండువా కప్పుకోవడం ఖాయమని సమాచారం. అదే జరిగితే వైకాపాకు కంచుకోటగా ఉన్న కడపలో పెను నష్టం జరిగినట్టే. మరోవైపు తెలుగుదేశం పార్టీ నేతలు ఇంకా మరెంతో మంది తమ పార్టీలో చేరేందుకు సిద్ధమని ప్రకటించడం, వైకాపా వర్గాల్లో కలకలం పుట్టిస్తోంది.

  • Loading...

More Telugu News