: కడప, కమలాపురం, మైదుకూరు... నేతలతో లోకేశ్ చర్చోపచర్చలు!
కడప జిల్లాలో బలంగా ఉన్న వైకాపాను మానసికంగా దెబ్బతీయడమే లక్ష్యంగా తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశ్ పర్యటన రెండో రోజు కొనసాగుతోంది. కడపతో పాటు కమలాపురం, మైదుకూరు, పులివెందుల ప్రాంతాల్లోని తెలుగుదేశం కార్యకర్తలతో ఆయన ప్రత్యేకంగా సమావేశం కానున్నారు. ఈ సందర్భంగా పార్టీ పటిష్ఠతకు పలు సూచనలు, సలహాలను ఇస్తారని టీడీపీ వర్గాలు తెలిపాయి. కాగా, నిన్న జిల్లాలోని ద్వితీయశ్రేణి నాయకులతో ప్రత్యేకంగా సమావేశమైన ఆయన, భవిష్యత్తు మనదేనని, పార్టీ కోసం పనిచేసేవారి కోసం ఎన్నో పదవులు ఎదురుచూస్తుంటాయని భరోసాను ఇచ్చినట్టు తెలిసింది.