: మున్నాభాయి విడుదలపై ట్విట్టర్ లో వ్యంగ్యాస్త్రాలు
అక్రమంగా ఆయుధాలు కలిగి ఉన్న కేసులో పుణెలోేని యెరవాడ జైలులో శిక్ష అనుభవించి విడుదల అవుతున్న బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ వ్యవహారంపై ట్విట్టర్లు వ్యంగ్యంగా స్పందించారు. సంజయ్ దత్ ఫిబ్రవరి 25న విడుదల అవుతున్నారా? లేక జైలులో హాజరు తక్కువగా ఉందని ఆయన్ను అక్కడి నుంచి వెళ్లగొడుతున్నారా..?: రమేష్ శ్రీనివాస్ సంజయ్ దత్ యెరవాడ జైలు నుంచి విడుదల అవుతున్నారు. అరవింద్ కేజ్రీవాల్ (ఢిల్లీ సీఎం) ఆయనకు ఓ కుట్టు మిషన్, పది వేల రూపాయలను సామాజిక బాధ్యత కింద అందజేస్తారేమో...: చికెన్ బిర్యానీ పేరుతో ఉన్న యూజర్ సంజయ్ దత్ శిక్షా కాలంలో 162 రోజుల పాటు జైలు బయటే ఉన్నారు. ఇన్ఫోసిస్ కంపెనీ కంటే ఇది గొప్ప లీవ్ పాలసీలా ఉంది: టెండుల్కర్ ఏదో ఒక రోజు సంజయ్ దత్ కు గౌరవంగా ఓ కాలనీ ఏర్పాటు చేసి దానికి పెరోల్ బాగ్ అని పెడతారు...: డాక్టరేట్ లార్జ్