: అంపైర్ ను దూషించిన ఫలితం... ఆస్ట్రేలియా క్రికెటర్లకు మ్యాచ్ ఫీజులో కోత
న్యూజిలాండ్ తో జరిగిన రెండో టెస్టు నాలుగో రోజు ఆటలో అంపైర్ మార్టినెస్ ను దూషించిన ఆస్ట్రేలియా జట్టు కెప్టెన్ స్టీవ్ స్మిత్, బౌలర్ హాజెల్ వుడ్ కు ఐసీసీ జరిమానా విధించింది. వారిద్దరూ క్రమశిక్షణ నియమావళిని ఉల్లంఘించారని నిర్ధారిస్తూ ఇద్దరినీ మందలించింది. అనంతరం మ్యాచ్ ఫీజుల్లో కోత విధిస్తున్నట్టు పేర్కొంది. స్మిత్ కు 30 శాతం, హాజెల్ వుడ్ కు 15 శాతం చొప్పున జరిమానా వేస్తున్నట్టు తెలిపింది. న్యూజిలాండ్ బ్యాట్స్ మన్ విలియమ్స్ 88 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద తన బౌలింగులో అవుటయ్యాడని హాజెల్ వుడ్ అప్పీలు చేశాడు. కానీ దాన్ని అంపైర్ మార్టినెస్ తిరస్కరించాడు. అటు స్మిత్ కూడా దానిపై సమీక్ష కోరినా అనుకూలంగా ఫలితం రాకపోయేసరికి అంపైర్ తో వాగ్వాదానికి దిగారు.