: ఆధారాలు లేకున్నా కన్నయ్యను అరెస్టు చేశారు: జ్యోతిరాదిత్య


ఢిల్లీ జేఎన్ యూ ఘటనలో కన్నయ్య కుమార్ ను అరెస్టు చేయడాన్ని కాంగ్రెస్ ఎంపీ జ్యోతిరాదిత్య సింధియా తన ప్రసంగంలో ఖండించారు. జేఎన్ యూ విద్యార్థుల గొంతు నొక్కే ప్రయత్నం చేస్తున్నారని కేంద్ర ప్రభుత్వంపై ఎదురుదాడి చేశారు. విద్యార్థులపై దేశద్రోహం అభియోగాలు మోపారని, ఆధారాలు లేకున్నా దేశద్రోహం కేసులో కన్నయ్యను అరెస్టు చేశారని ఆరోపించారు. ఇష్టం వచ్చినట్టు విశ్వవిద్యాలయాలపై నిందలు వేయటం సరికాదని కేంద్రానికి సూచించారు. ఓవైపు బాబా సాహెబ్ అంబేద్కర్ ఆదర్శాలను వల్లెవేస్తున్న ఈ ప్రభుత్వం, మరోవైపు దళితులకు అన్యాయం చేస్తోందని విమర్శించారు.

  • Loading...

More Telugu News