: రాజ్ నాథ్ తో జగన్ భేటీ... రాష్ట్రపతికిచ్చిన వినతులనే వల్లె వేసిన వైసీపీ అధినేత
వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఢిల్లీ పర్యటన ఇంకా కొనసాగుతోంది. మొన్న ఉదయం హస్తిన బయలుదేరిన జగన్... తొలిరోజు ఏ ఒక్కరి అపాయింట్ మెంట్ దక్కని కారణంగా బాబాయ్ వైవీ సుబ్బారెడ్డి ఇంటికే పరిమితమయ్యారు. నిన్న రాష్ట్రపతి భవన్ కు వెళ్లిన జగన్... ప్రణబ్ ముఖర్జీతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్రానికి ప్రత్యేక హోదా, ప్రత్యేక కేటాయింపులపై వినతులు అందజేశారు. తాజాగా కొద్దిసేపటి క్రితం ఆయన కేంద్ర హోం శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ తో భేటీ అయ్యారు. భేటీ ముగిసిన తర్వాత బయటకు వచ్చిన జగన్ మీడియాతో మాట్లాడుతూ నిన్న రాష్ట్రపతి వద్ద ప్రస్తావించిన అంశాలనే రాజ్ నాథ్ వద్ద ప్రస్తావించానని చెప్పారు.