: మానసిక స్థితి బాగుండకే అలా ప్రవర్తించాను... సీజేకు మద్రాస్ హైకోర్టు జడ్జి వివరణ


మద్రాస్ హైకోర్టుకు చెందిన వివాదాస్పద జస్టిస్ కర్నన్ ఇటీవలి తన ప్రవర్తనపై భారత ప్రధాన న్యాయమూర్తి(సీజే)కి వివరణ ఇచ్చారు. ఈ మేరకు ఆయనకు లేఖ రాశారు. తన మానసిక పరిస్థితి ఏమాత్రం బాగోలేదని, అందుకే తప్పుడు ఆర్డర్ పంపానని తెలిపారు. ఇకపై అలాంటి తప్పులు చేయనని, తన వైఖరి సక్రమంగా ఉండేలా చూసుకుంటానని హామీ ఇచ్చారు. అయితే కొందరు సహచర న్యాయమూర్తులు తనను ఎగతాళి చేయడంవల్లే మానసికంగా కుంగిపోయానని చెప్పారు. తాను షెడ్యూల్డు కులాలకు చెందిన వ్యక్తి కావడంతో ఇతర న్యాయమూర్తుల వేధింపులకు గురవుతున్నానని కర్నన్ వివరించారు. ఈ విషయాన్ని గతంలో తాను సీజీఎఫ్ జాతీయ కమిషన్ చైర్మన్ కు కూడా ఫిర్యాదు చేశానన్నారు. అయితే ఆ జడ్జిల పేర్లు చెప్పలేదన్నారు. న్యాయవ్యవస్థలో కులతత్వాన్ని నిర్మూలించాలని, మత సామరస్యాన్ని కాపాడటంలో ముందుండాలని కోరుకుంటున్నానని తెలిపారు. భారత ప్రధాన న్యాయమూర్తి టిఎస్ ఠాకూర్ కోల్ కతా హైకోర్టుకు కర్నన్ ను గతంలో బదిలీ చేయడంపై తానే సుమోటాగా చర్యలు తీసుకున్నారు. తనను బదిలీ చేయడానికి గల కారణాలపై వివరణ ఇవ్వాలని కర్నన్ ఆదేశించారు. ఆ తరువాత కర్నన్ కు ఎలాంటి కేసులు అప్పగించవద్దని సుప్రీంకోర్టు న్యాయమూర్తి మద్రాస్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిని ఆదేశించిన సంగతి తెలిసిందే.

  • Loading...

More Telugu News