: వైఎస్ జగన్ కు నారా లోకేశ్ సవాల్... చేతనైతే ఒక్కరోజులో ప్రభుత్వాన్ని కూల్చాలని సవాల్


టీడీపీ చేపట్టిన ’ఆకర్ష్’తో ఆ పార్టీ యువనేత, పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ లో ఉత్సాహం ఉరకలెత్తుతున్నట్లుంది. ఆకర్ష్ లో ఐదుగురు వైసీపీ నేతలు తమ పార్టీలో చేరిన రెండు రోజులకే ఆయన వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సొంత జిల్లా కడప పర్యటనకు బయలుదేరారు. ఈ క్రమంలో కొద్దిసేపటి క్రితం మీడియాతో మాట్లాడిన సందర్భంగా వైఎస్ జగన్ కు ఆయన ఓ సవాల్ విసిరారు. ‘చేతనైతే ఒక్క రోజులో ప్రభుత్వాన్ని కూల్చు’ అంటూ ఆయన ప్రతిపక్ష నేతకు సవాల్ చేశారు. తమ పార్టీ ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలకు ఆకర్షితులై వచ్చే ఇతర పార్టీ నేతలను వద్దని చెప్పబోమని లోకేశ్ పేర్కొన్నారు. తమ పార్టీ అధినేత చంద్రబాబునాయుడిపై విపక్షాలు చేస్తున్న విమర్శలు అర్థరహితమని విరుచుకుపడ్డారు. టీఆర్ఎస్ తో లోపాయికారీ ఒప్పందం కారణంగా గ్రేటర్ హైదరాబాదు మునిసిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో వైసీపీ పోటీ చేయలేదని ఆరోపించారు. తాము మాత్రం గ్రేటర్ ఎన్నికల్లో ఏకంగా 7 లక్షల ఓట్లను సాధించామని చెప్పారు. ప్రతిపక్షం నిర్మాణాత్మక పాత్ర పోషించాలని లోకేశ్ అభిప్రాయపడ్డారు.

  • Loading...

More Telugu News