: కన్నయ్య భద్రతకు హైకోర్టు భరోసా.... బెయిలు పిటిషన్ పై విచారణ వాయిదా
దేశద్రోహం కేసులో అరెస్టైన జేఎన్ యూ విద్యార్థి సంఘం నేత కన్నయ్యకుమార్ బెయిలు పిటిషన్ పై ఢిల్లీ హైకోర్టులో ఈ రోజు విచారణ జరిగింది. పాటియాలా హౌస్ కోర్టు ఆవరణలో రెండుసార్లు తనపై, తన న్యాయవాదులపై జరిగిన దాడి నేపథ్యంలో భద్రత కల్పించాలని కన్నయ్య న్యాయస్థానాన్ని కోరారు. దీనికి స్పందించిన కోర్టు, ఎలాంటి ప్రమాదం ఉండదని, పటిష్టమైన భద్రత కల్పిస్తామని హామీ ఇచ్చింది. కన్నయ్యపై చిన్న దెబ్బ కూడా పడనీయమని, ఈ మేరకు భద్రతా చర్యలు తీసుకోవాలని ఢిల్లీ పోలీసులను కోర్టు ఆదేశించింది. అనంతరం విచారణను ఈ నెల 29కి వాయిదా వేస్తున్నట్టు తెలిపింది.