: ముస్లింల పరిస్థితి భారత్ లోనే బాగుందట!... మనసులోని మాట చెప్పిన జిహాదీ


ప్రపంచంలో ఇస్లామిక్ దేశాలు చాలానే ఉన్నాయి. ఇస్లామిక్ రాజ్య స్థాపనే లక్ష్యమంటూ ప్రపంచ దేశాలపై దాడులకు బరి తెగిస్తున్న ఉగ్రవాదులకు ఆయా దేశాలు ఆలవాలంగా మారాయి. ఇస్లామిక్ రాజ్యాలుగా ఉన్న ఆయా దేశాల్లో ముస్లింల పరిస్థితి ఎలా ఉన్నా, హిందూ దేశమైన భారత్ లో మాత్రం ముస్లింల స్థితిగతులు బాగానే ఉన్నాయట. అంతేకాదు, ప్రపంచంలోని ఇతర దేశాల్లో కంటే కూడా భారత్ లోనే ముస్లింల స్థితిగతులు బాగున్నాయట. ఈ విషయాన్ని ఏ అధ్యయన సంస్థో చెప్పిన విషయం కాదు. భారత్ పై దాడుల కోసం వచ్చి ఇక్కడి పరిస్థితులు చూసి మనసు మార్చుకున్న ఓ జిహాదీ చెప్పిన నగ్న సత్యం. దశాబ్దం క్రితం ఏపీలోని ప్రాంతాల్లో దాడులు చేసేందుకు వచ్చిన అబ్దుల్ అజీజ్ అలియాస్ గిద్దా తన మనసులోని మాట చెప్పాడు. భారత్ లో ముస్లింల స్థితిగతులను పరిశీలించిన అతడు దాడులు చేయాలన్న తన మనసును కూడా మార్చుకున్నాడు. అయితే లష్కరే తోయిబా ఉగ్రవాదులు మళ్లీ అతడి మనసు మార్చి కరుడుగట్టిన ఉగ్రవాదిగా మార్చేశారు. సౌదీలో చమురు బావులను పేల్చేసిన కేసులో అక్కడి పోలీసులకు చిక్కిన అజీజ్ ను ఆ దేశం ఇటీవలే భారత్ కు అప్పజెప్పింది. ఈ క్రమంలో నాడు అతడు తన మనసులోని మాటను బయటపెట్టిన విషయం తాజాగా వెలుగులోకి వచ్చింది.

  • Loading...

More Telugu News