: నేపాల్ లో అదృశ్యమైన విమానం!
నేపాల్ పర్వతాల్లో కొద్దిసేపటి క్రితం ఓ విమానం అదృశ్యమైంది. ఈ విషయాన్ని అధికారులు ధ్రువీకరించారు. 21 మంది ప్రయాణికులు, సిబ్బందితో ఉన్న విమానం టేకాఫ్ అయిన కొద్దిసేపటికే పైలెట్లతో సంబంధాలు తెగిపోయాయని, ఆపై విమానం ఎటు వెళ్లిందన్న విషయాన్ని రాడార్లు పసిగట్టలేకపోయాయని ఖాట్మండు విమానాశ్రయ అధికారి తెలిపారు. పొఖారా నుంచి ఉదయం 7:45కు బయలుదేరిన విమానం జామ్ సోమ్ కు వెళ్లాల్సి వుంది. ఈ రెండు పట్టణాల మధ్య విమాన ప్రయాణానికి కేవలం 18 నిమిషాల సమయం మాత్రమే పడుతుంది. మధ్యలో ఏ విధమైన ఎయిర్ స్ట్రిప్ లు లేకపోవడంతో ప్రయాణికుల బంధువులు ఆందోళన చెందుతున్నారు. ఈ విమానం జాడ కోసం ప్రయత్నిస్తున్నామని వివరించారు.