: సృష్టి విరుద్ధం... అన్నతో వివాహమేంటని ప్రశ్నించినందుకు రెండుసార్లు ఆత్మహత్యాయత్నం!


సభ్య సమాజం అంగీకరించని బంధాన్ని ఆ యువతి కోరుతోంది. అన్నతో పెళ్లేంటని వారించినందుకు ఓ యువతి నిద్రమాత్రలు మింగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. విజయనగరం పోలీసులు వెల్లడించిన కథనం ప్రకారం, శ్రీకాకుళం జిల్లా సంతకవిటికి చెందిన ఓ యువతి, అదే గ్రామంలోని తన పెదనాన్న కుమారుడితో ప్రేమలో పడింది. తామిద్దరమూ రహస్యంగా వివాహం కూడా చేసుకున్నామని చెబుతున్న ఆ యువతి, అతనితో పంపించాలని చెబుతూ కొద్ది రోజుల క్రితం పురుగుల మందు తాగి తృటిలో ప్రాణాపాయం నుంచి తప్పించుకుంది. ఈ ఘటనలో కేసు నమోదు కాగా, మహిళా పోలీసులు ఇద్దరికీ కౌన్సిలింగ్ నిర్వహించి పంపించారు. ఆ తర్వాత తాము కలవకుండా కుటుంబసభ్యులు కట్టుదిట్టం చేయడంతో, మనస్తాపానికి గురైన ఆమె నిన్న నిద్రమాత్రలు మింగి మరోసారి ఆత్మహత్యాయత్నం చేసింది. సదరు యువతికి ఎన్ని విధాలుగా నచ్చజెప్పినప్పటికీ, మాట వినకుండా అతనితో పంపాలనే మొండికేసింది. తనను పంపకుంటే, మరోసారి ఆత్మహత్యకు ప్రయత్నిస్తానని హెచ్చరిస్తోంది. ఆమె స్టేట్ మెంట్ రికార్డు చేసిన పోలీసులు, వారు వరుసకు అన్నా చెల్లెళ్లని, సమాజం అంగీకరించని ఈ బంధం కూడదని మరోసారి కౌన్సిలింగ్ చేసి చూస్తామని చెబుతున్నారు.

  • Loading...

More Telugu News