: చంద్రబాబులా దొడ్డిదారిన వెళ్లలేను, నేనైతే ఏం చేస్తానంటే..: జగన్
తాను చంద్రబాబునాయుడిలా దొడ్డిదారి రాజకీయాలు నడపలేనని వైకాపా అధినేత వైఎస్ జగన్ వ్యాఖ్యానించారు. తమ పార్టీ తరఫున గెలిచిన ఎంపీలు ఎస్పీ వై రెడ్డి, కొత్తపల్లి గీతలను ఆయన లాక్కుపోయారని, ఇప్పుడు మరో నలుగురిని ప్రలోభాలు, భయాలకు గురిచేసి తనవైపు తిప్పుకున్నారని వ్యాఖ్యానించిన ఆయన, తానెప్పుడూ అటువంటి పనులు చేయాలని ఆలోచించలేదని అన్నారు. ఎమ్మెల్యేలు తమతో కలసి వస్తే, తొలుత ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం పెట్టి, వారిని డిస్ క్వాలిఫై చేయించి, ఆపై ప్రజల్లోకి వెళతామని చెప్పారు. వారందరినీ ప్రజల ఆశీస్సులు, అండదండల సాయంతో గెలిపించుకుంటామని అన్నారు. ఎన్టీఆర్ కు వెన్నుపోటు పొడిచి అధికారంలోకి వచ్చిన ఘనత చంద్రబాబుదేనని ఎద్దేవా చేశారు.