: అమెరికాలో స్వల్ప భూకంపం!
ఈ తెల్లవారుఝామున అమెరికాలోని మధ్య, దక్షిణ కాలిఫోర్నియా ప్రాంతంలో భూకంపం సంభవించింది. వాస్కో నగరానికి దాదాపు 40 కిలోమీటర్ల దూరంలో భూకంప కేంద్రం ఉందని అధికారులు తెలిపారు. రిక్టర్ స్కేలుపై 4.8గా నమోదైన భూకంపం తీవ్రతతో పలు ప్రాంతాల్లో రహదారులు బీటలు వారినట్టు తెలుస్తోంది. తీవ్రత అధికంగానే ఉందని కెర్న్ కౌంటీ షరీఫ్ ఉద్యోగి వివరించారు. కాగా, భూకంపంతో ఎవరూ గాయపడినట్టు సమాచారం లేదు. లాస్ ఏంజిల్స్, వెంచురా, శాంటా బార్బరా తదితర ప్రాంతాల్లోనూ ప్రకంపనలు కనిపించాయి.