: టీడీపీ ఎక్కడుంది?...ఓఎల్ ఎక్స్ లో అమ్మకానికి పెట్టారు: రోజా విశ్లేషణ
తెలుగు రాష్ట్రాల్లో టీడీపీ తుడిచిపెట్టుకుపోయిందని వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే రోజా తెలిపారు. ఓ టీవీ ఛానెల్ లో చర్చ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో పాలిస్తోంది టీడీపీ కాదని, వివిధ పార్టీల కూటమి అని అన్నారు. టీడీపీలో సరైన నేతలు లేక, పోటీ చేసేందుకు క్యాండిడేట్లు లేక కాంగ్రెస్ నేతలను తెచ్చుకున్నారని తెలిపారు. అలా కాంగ్రెస్ నుంచి వచ్చిన 30 మంది అధికార పార్టీ నేతలుగా ఉన్నారని ఆమె చెప్పారు. అలాగే బీజేపీ నుంచి వచ్చిన నేతలను కూడా తమ పార్టీ నేతలనే భ్రమలో టీడీపీ నేతలు ఉన్నారని ఆమె అన్నారు. ఇప్పుడు వైఎస్సార్సీపీ నేతలను టీడీపీలో చేర్చుకుంటున్నారని ఆమె చెప్పారు. వీరందర్నీ తప్పిస్తే తెలుగు రాష్ట్రాల్లో టీడీపీ లేదని ఆమె అన్నారు. అందుకే టీడీపీ జాతీయ పార్టీ ఆఫీసును విజయవాడలో పెట్టుకున్నారని, హైదరాబాదులోని పార్టీ ప్రధాన కార్యాలయాన్ని ఓఎల్ఎక్స్ లో అమ్మకానికి పెట్టారని ఆమె ఎద్దేవా చేశారు.