: నేతలు కలిసినంత సులువుగా కార్యకర్తలు కలవలేరు: గంగుల


పార్టీలలో నేతలు కలిసినంత సులువుగా కార్యకర్తలు కలవలేరని ఆళ్లగడ్డ టీడీపీ నేత గంగుల ప్రభాకరరెడ్డి అన్నారు. విజయవాడలో ముఖ్యమంత్రి చంద్రబాబుతో సమావేశం కానున్న నేపథ్యంలో ఆయన మాట్లాడుతూ, భూమా కుటుంబం టీడీపీలో చేరడంపై కార్యకర్తలు అసంతృప్తిగా ఉన్నారని అన్నారు. ఆళ్లగడ్డ, జమ్మలమడుగు వంటి నియోజకవర్గాల్లో పార్టీల కోసం కార్యకర్తలు ప్రాణాలు అర్పించిన సంఘటనలు చాలా ఉన్నాయని ఆయన చెప్పారు. అలాంటి కార్యకర్తలను పరిగణనలోకి తీసుకోకుండా చేరికలు సరికాదని ఆయన అభిప్రాయపడ్డారు. కార్యకర్తలే నేతల బలమని చెప్పిన ఆయన వారిని సంతృప్తి పరచకుండా నిర్ణయాలు తీసుకోమని స్పష్టం చేశారు. ఇప్పుడు పార్టీలో చేరిన భూమా కుటుంబంతో సమన్వయం కుదిరితే బాగానే ఉంటుందని చెప్పిన ఆయన, సమన్వయం కుదరకపోతే పరిస్థితి ఏంటని ప్రశ్నించారు. కార్యకర్తల్లో చాలా అనుమానాలు ఉన్నాయని ఆయన చెప్పారు. వాటికి సమాధానం చెప్పి వారిని సంతృప్తి పరచాల్సిన బాధ్యత పార్టీపై ఉందని ఆయన తెలిపారు.

  • Loading...

More Telugu News