: సోమిరెడ్డి! నువ్వు తలసానితో మాట్లాడుతున్నావని గుర్తుంచుకో: తలసాని


"ఏమయ్యా, సోమిరెడ్డి, ఏం మాట్లాడుతున్నావు నువ్వు...తలసానితో మాట్లాడుతున్నావని గుర్తుంచుకో. మేము పార్టీ మారినప్పుడు అరిచి గగ్గోలు పెట్టిన మీరు ఇప్పుడు వైఎస్సార్సీపీ నేతలను పార్టీలోకి ఎలా చేర్చుకున్నారు?" అంటూ తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ప్రశ్నించారు. ఓ టీవీ ఛానెల్ నిర్వహించిన చర్చలో మాట్లాడుతూ, ఆంధ్రప్రదేశ్ లో వైఎస్సార్సీపీ నేతలు టీడీపీలో చేరడం తప్పు కాదని సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అన్నారు. దీనిపై తలసాని మాట్లాడుతూ, తెలంగాణలో తాము చేసినది తప్పని చెప్పిన టీడీపీ, ఇప్పుడెందుకు వైఎస్సార్సీపీ నేతలను పార్టీలో చేర్చుకుందని ఆయన నిలదీశారు. చంద్రబాబు నీతికి, న్యాయానికి కట్టుబడే మనిషి కాదని ఆయన చెప్పారు. చంద్రబాబు ఎవరినీ నమ్మరన్నది అందరికీ తెలిసిందేనని ఆయన పేర్కొన్నారు. సోమిరెడ్డి తప్పనిసరి పరిస్థితుల్లో టీడీపీని వెనకేసుకుని వస్తున్నారని ఆయన అన్నారు. 'తెలంగాణలో మేము చేస్తే తప్పయినప్పుడు ఆంధ్రప్రదేశ్ లో టీడీపీ చేస్తే తప్పు కాదా?' అని ఆయన నిలదీశారు.

  • Loading...

More Telugu News