: హిందూ పురోహితుడిని హతమార్చింది మేమే: ఐఎస్ఐఎస్


బంగ్లాదేశ్ రాజధాని ఢాకాలో హిందూ పూజారిని హతమార్చింది తామేనని ఉగ్రవాద సంస్థ ఐఎస్ఐఎస్ ప్రకటించింది. ఈమేరకు సామాజిక మాధ్యమాల్లో ఈ ప్రకటన చేశారు. కాగా, రెండు రోజుల క్రితం ఈ సంఘటన జరిగింది. ఢాకాకు 308 కిలోమీటర్ల దూరంలో ఉన్న పాంచగర్ కు సమీపంలో దేవీగంజ్ ఆలయం ఉంది. అక్కడ పూజారిగా పనిచేస్తున్న జోగేశ్వర్ రాయ్(55) ఆలయంలో పూజలు నిర్వహిస్తున్న సమయంలో సుమారు ఆరుగురు ఉగ్రవాదులు చొరబడి ఆయన గొంతు కోసేశారు. దీంతో ఆయన ప్రాణాలు కోల్పోయాడు. పూజారిని రక్షించేందుకు వచ్చిన భక్తుడిపై కాల్పులు జరపడంతో అతను గాయపడ్డాడని పోలీసులు చెప్పారు.

  • Loading...

More Telugu News