: చంద్రబాబు తప్పుడు కేసులు పెట్టారు: జగన్
కాపు గర్జన సందర్భంగా తలెత్తిన ఆందోళనల్లో తమ పార్టీకి చెందిన నేతలపై తప్పుడు కేసులు బనాయిస్తున్నారని వైఎస్సార్సీపీ అధినేత జగన్ ఆరోపించారు. ఢిల్లీలో రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీని కలిసిన అనంతరం ఆయన మాట్లాడుతూ, కాపు గర్జనలో చంద్రబాబు తప్పులు చేసి, అవి ఇతరులపై నెట్టేస్తున్నారని అన్నారు. తుని ఘటనలో రైల్వే ట్రాక్ దగ్గర్లో బహిరంగ సభకు అనుమతి ఎలా ఇచ్చారని ప్రశ్నించారు. మూకుమ్మడిగా భారీ సభ నిర్వహిస్తున్నప్పుడు ముందు జాగ్రత్తగా బందోబస్తు ఎందుకు చేపట్టలేదని ఆయన నిలదీశారు. ఇవేవీ చేయని చంద్రబాబు, తప్పును తమ పార్టీ నేతలపై తోస్తున్నారని ఆయన మండిపడ్డారు. ఈ విషయంలో చంద్రబాబును జైల్లో పెట్టాలని ఆయన డిమాండ్ చేశారు. దీనిపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని ఆయన డిమాండ్ చేశారు.