: 25న అధికారికంగా టీఆర్ఎస్ లోకి ఎర్రబెల్లి
ఈ నెల 25న ఎర్రబెల్లి దయాకర్ రావు టీఆర్ఎస్ పార్టీలోకి అధికారికంగా చేరుతున్నారు. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా మీడియాకు తెలిపారు. తెలంగాణ భవన్ లో సీఎం కేసీఆర్ సమక్షంలో ఆ పార్టీలో చేరనున్నట్టు ఆయన చెప్పారు. కొన్ని రోజుల కిందట అనూహ్యంగా టీడీపీని వీడిన ఎర్రబెల్లి... కేసీఆర్ ను కలసి ఆ పార్టీలో చేరతానని ప్రకటించిన సంగతి తెలిసిందే.